గాంధీనగర్: మాజీ కాంగ్రెస్ నేత హార్ధిక్ పటేల్, గురువారం నుంచి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోకి చిన్న సైనికుడిగా చేరుతున్నానంటూ ట్వీట్ చేశారు. దీంతో హార్థిక్‌పటేల్ బీజేపీలో చేరడం అధికారికమైంది. ఈ కొత్త అధ్యాయం ప్రారంభించడానికి జాతీయ, ప్రాంతీయ, మరియు సామాజిక ఆసక్తులు కారణమని హార్థిక్ పటేల్ ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో చిన్నసైనికుడిగా జాతీయస్థాయి సేవలు అందిస్తానని హార్ధిక్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరిన హార్ధిక్ పటేల్, పటిదార్ రిజర్వేషన్ ఆందోళనలతో వెలుగులోకి వచ్చారు.
విద్యా,ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం పటిదార్ వర్గానికి రిజర్వేషన్ల కల్పించాలనే డిమాండ్‌తో ఆ వర్గానికి చెందిన ప్రజలు గుజరాత్‌లో చేసిన భారీ ఆందోళనలకు హార్ధిక్ నాయకత్వం వహించారు. తద్వారా జాతీయ రాజకీయాల్లో హార్ధిక్ పటేల్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ తర్వాత 2019లో కాంగ్రెస్‌పార్టీలో చేరిన హార్ధిక్ ఆ పార్టీకి గతవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సోనియా, రాహుల్‌లకు పంపిన హార్ధిక్ లేఖలో రాహుల్‌ను టార్గెట్ చేశారు. గుజరాత్ కాంగ్రెస్ నేతల ఫోన్లను పార్టీ అగ్రనేతలు తీయకపోయినా, గుజరాత్ లీడర్లు మాత్రం వారికి చికెన్, శాండ్‌విచ్ ఏర్పాటు చేయడంలో బిజీగా ఉన్నారని విమర్శించారు. బీజేపీలో చేరకముందు హార్ధిక రకరకాల వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పటికీ బీజేపీలో చేరనని ఒకసారి, ఆప్‌లో చేరతానో, బీజేపీలో చేరతానో తెలియదని మరోసారి రకరకాల వ్యాఖ్యాలను చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..