Sunday, September 8, 2024

IPL 2024 | గుజరాత్ టైటాన్స్ కే హార్దిక్ పాండ్యా..

ఐపీఎల్-2024 ఆటగాళ్ల రిలీజ్, రిటెన్షన్ ప్రక్రియలో అత్యంత ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ అట్టిపెట్టుకుంది. హార్దిక్ పాండ్యాను ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేయనుందంటూ తాజాగా సోష‌ల్ మీడియాలో ప్రచారం జరిగింది.

అయితే, గుజరాత్ టైటాన్స్ ఆ రూమ‌ర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టింది. అప్ క‌మిగ్ సీజన్ లోనూ హార్దిక్ పాండ్యానే గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తాడ‌ని వెల్ల‌డించింది. పాండ్యా నాయకత్వంలో ఆడిన తొలి సీజన్ లోనే ఐపీఎల్ టైటిల్ నెగ్గి సంచలనం సృష్టించిన గుజరాత్ టైటాన్స్, ఆ తరువాతి సీజన్ లో రన్నరప్ గా నిలిచింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement