Wednesday, September 18, 2024

Hard Landing – కుప్పకూలిన నేవీ హెలికాప్ట‌ర్‌


అరేబియాలో స‌ముద్రంలో హార్డ్ ల్యాండింగ్‌
పోరుబంద‌ర్ తీరం వ‌ద్ద విషాదం
ముగ్గురు సిబ్బంది మిస్సింగ్‌
హ‌రి లీలా నౌక వ‌ద్ద‌ రెస్క్యూ ఆప‌రేష‌న్‌
రంగంలోకి దిగిన ఐసీజీ బృందం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్‌:
గుజ‌రాత్‌లోని పోరుబంద‌ర్ తీరం వ‌ద్ద విషాదం చోటుచేసుకున్న‌ది. అరేబియా స‌ముద్రంలో భార‌తీయ నౌకాద‌ళానికి చెందిన అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్ట‌ర్ కూలింది. రెస్క్యూ కోసం వెళ్లిన ఆ హెలికాప్ట‌ర్ కూలిన ఘ‌ట‌న‌లో ముగ్గురు సిబ్బంది గ‌ల్లంతయ్యారు. ఒక‌రి మృతదేహాన్ని గుర్తించారు. మోటార్ ట్యాంక‌ర్ హ‌రి లీలా నౌక వ‌ద్ద‌కు రెస్క్యూ చేసేందుకు ఈ హెలికాప్ట‌ర్ వెళ్లింది. అయితే.. ఆ స‌మ‌యంలో హార్డ్ ల్యాండింగ్ జ‌రిగిన‌ట్లు అనుమానిస్తున్నారు. దీంతో ఐసీజీ సిబ్బంది రంగంలోకి దిగింది. నాలుగు నౌక‌లు, రెండు విమానాల ద్వారా సెర్చ్ ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంది. సోమ‌వారం రాత్రి 11 గంట‌ల‌కు ఏఎల్‌హెచ్ రెస్క్యూ ఆప‌రేష‌న్‌కు వెళ్లింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement