Wednesday, September 25, 2024

Harassment Case – జానీ మాస్ట‌ర్‌కు నాలుగు రోజులు పోలీసు క‌స్ట‌డి

క‌స్ట‌డీ కోరుతూ నార్సింగ్ పోలీసులు పిటీష‌న్‌
రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశం
ఈ రోజే క‌ష్ట‌డికి తీసుకున్న పోలీసులు.
విచార‌ణ ప్రారంభం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కి నాలుగు రోజుల కస్టడీ విధిస్తూ రంగారెడ్డి కోర్టు బుధ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. లైంగిక వేధింపు ఆరోప‌ణ‌ల‌పై రిమాండ్ ఖైదీగా చంచ‌ల్‌గుడ జైలులో జానీ మాస్ట‌ర్ ఉన్న సంగ‌తి విదిత‌మే. 21 ఏళ్ల స‌హాయ‌ కొరియోగ్రాఫ‌ర్ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు నార్సింగ్ పోలీసులు పోక్సో చ‌ట్టం కింద అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే.

క‌స్ట‌డీని కోరిన నార్సింగ్ పోలీసులు
పోక్సో చ‌ట్టం కింద అరెస్టయిన జానీ మాస్ట‌ర్‌ను విచార‌ణ నిమిత్తం ఐదు రోజుల‌పాటు పోలీసు క‌స్ట‌డీకి ఇవ్వాల‌ని కోరుతూ రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటీష‌న్ వేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన రంగారెడ్డి కోర్టు తీర్పును బుధవారానికి వాయిదా వేసింది. నాలుగు రోజుల‌పాటు పోలీసు క‌స్ట‌డీకి అనుమ‌తి ఇస్తూ జ‌డ్జి బుధ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేశారు.

- Advertisement -

త‌క్ష‌ణ‌మే పోలీసు క‌స్ట‌డి
రంగారెడ్డి కోర్టు అనుమ‌తి ఇవ్వ‌డంతో ఈ రోజే జానీ మాస్ట‌ర్‌ను నార్సింగ్ పోలీసులు క‌స్ట‌డీకి తీసుకుంటున్నారు. ఈ రోజే నుంచి విచార‌ణ ప్రారంభించ‌డానికి పోలీసులు చ‌ర్య‌లు చేప‌ట్టారు. చంచ‌ల్‌గూడలో రిమాండ్ ఖైదీగా ఉన్న జానీని నార్సింగ్ పోలీస్టేష‌న్‌కు తీసుకు వెళ్ల‌డానికి పోలీసులు సిద్ధ‌మ‌య్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement