Monday, November 25, 2024

Loan App Harassment : లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులు.. మరొకరు బలి..

చిత్తూరు : ఏపీలో లోన్ యాప్ వేధింపులు ఆగడం లేదు. రోజురోజుకూ వీరి ఆగడాలు పెరిగిపోతూనే ఉన్నాయి.. అవసరానికి డబ్బు తీసుకున్నా.. తిరిగి కట్టలేక వేధింపులతో ప్రాణాలు తీసుకునేవారు కొందరైతే.. చెల్లించినా వేధింపులు తప్పక ఆత్మహత్యలకు పాల్పడుతోన్నవారు మరికొందరు.. డబ్బు త్వరగా అందుతుందని.. ఈజీ ప్రాసెస్ అని కమిట్ అయి.. లోన్ యాప్స్ కు చాలామంది వారి వ‌ల‌లో ప‌డుతున్నారు. అనుకున్న సమయానికి డబ్బులు చెల్లించలేకపోవడంతో వాళ్లు పెట్టే వేధింపులు తట్టుకోలేక ప్రాణాలు వదులుతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా పెనుమూరు మండలానికి చెందిన ఓ యువ‌కుడు లోన్ యాప్ కు బ‌ల‌య్యాడు. యాప్‌ నిర్వాహకుల వేధింపులకు త‌ట్టుకోలేక ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి.. పెనుమూరు మండలం ఏపీ కాలనీకి చెందిన జానకిరామ్(25) సూసైడ్ నోట్ రాసి ఇంటిలోనే ఉరి వేసుకున్నాడు. లోన్ యాప్‌లో జానకీరామ్ 80 వేల రూపాయలు అప్పు తీసుకున్నాడు. కొంత కాలం బాగానే చెల్లించినా.. ఆ తర్వాత చెల్లింపులు చేయడం ఆ యువకుడికి కష్టంగా మారింది.. గ‌త కొంత‌కంగా కట్టలేక వారి బ్లాక్ మెయిల్‌కు భయపడి బలవన్మరణాన్ని ఆశ్రయించాడు. నెల రోజులుగా అయ్యప్ప మాలధారణలో ఉన్న జానకీరామ్ ఈరోజు సాయంత్రం మాల తీసి ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement