ఆంధ్రప్రభ స్మార్ట్ – న్యూ ఢిల్లీ – ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు యావత్తు భారతావని సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ‘హర్ ఘర్ తిరంగా’ పేరిట ప్రచార కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని జాతీయ పండగగా నిర్వహించాలని జులైలో మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరు పాల్గొని జాతీయ పతాకంతో సెల్ఫీ దిగి ఆ చిత్రాన్ని హర్‌తిరంగా.కామ్ వెబ్సైట్లో పోస్ట్ చేయాలని సూచించారు.
‘హర్‌ఘర్‌తిరంగా’ను గుర్తుండిపోయే ఈవెంట్‌గా మార్చుకుందామని దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాజాగా పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా అందరూ త్రివర్ణ పతాకాన్ని తమ సోషల్ మీడియా ఖాతాల్లో ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకోవాలని సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ వేదికగా మోదీ ట్వీట్ పెట్టారు.
‘ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో హర్ఘర్తిరంగాని మరపురాని ప్రజా ఉద్యమంగా మారుద్దాం. నేను నా ప్రొఫైల్ చిత్రాన్ని త్రివర్ణ పతాకంగా మార్చుకున్నాను. మీరు కూడా అలాగే చేసి ఈ ఉద్యమంలో నాతో చేరాలని మీ అందరినీ కోరుతున్నాను. జాతీయ జెండాలతో ఉన్న మీ సెల్ఫీలను హర్‌ఘర్‌తిరంగా.కామ్
(https://hargartiranga.com)
లో షేర్ చేయండి’ అంటూ మోదీ పిలుపునిచ్చారు.