కరోనా మహమ్మారి పంజా విసురుతున్న వేళ ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చార్ధామ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కేవలం ఆ నాలుగు ఆలయాల్లో ఉండే పూజారులు మాత్రమే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ వెల్లడించారు. మే 14 నుంచి ఈ యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది.
అయితే కరోనా సెకండ్ వేవ్ వణికిస్తున్న సమయంలో కూడా కుంభమేళాను అలాగే కొనసాగించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఉత్తరాఖండ్ ప్రభుత్వం.. గురువారం ప్రత్యేకంగా సమావేశమై చార్ధామ్ యాత్రను రద్దు చేయాలని నిర్ణయించింది. కుంభమేళా కారణంగా ఉత్తరాఖండ్లో కరోనా కేసులు భారీగా పెరిగిపోయాయి. ఏప్రిల్ 1న 2,200 కేసులు రాష్ట్రంలో ఉండగా.. అవి ఏప్రిల్ 27 నాటికి నాటికి 45 వేలకు పైగా నమోదు కావడం గమనార్హం.