మహిళలందరికీ సెల్యూట్ చేస్తున్నానని మహిళా దినోత్సవం సందర్భంగా ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ప్రపంచంలో తమ న్యాయబద్ధమైన స్థానం కోసం పోరాడుతున్న స్ఫూర్తిదాయకమైన మహిళలందరికీ సెల్యూట్ చేస్తున్నాను. భవిష్యత్ తరాలు ముందుకెళ్లడానికి మీరు ఊపిరి అందిస్తున్నారు.. తన జీవితంలో అత్యంత ప్రభావవంతమైన మహిళలు వీరే అంటూ తల్లి అంజనమ్మ, భార్య సురేఖలతో దిగిన ఫోటోను షేర్ చేశారు. ఒక కుటుంబంలో మహిళలకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి. చిన్నతనంలో నా కోసం అమ్మ ఎంతో కష్టపడ్డారు. ఆమె కారణంగానే నేను మహిళా పక్షపాతిగా మారాను అని గతంలో చిరంజీవి వ్యాఖ్యానించారు. నేను సక్సెస్‌ఫుల్ హీరోగా నిలవడానికి సురేఖనే ప్రధాన కారణం. ఇంట్లో నా బాధ్యతలన్నీ తనే తీసుకుంది. దీంతో సినిమాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాను. ప్రతి మగాడి విజయం వెనకాల ఒక మహిళ కచ్చితంగా ఉంటుందనడానికి సురేఖ మరో నిదర్శనం అని ఆయన అన్నారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా.. అంతరిక్షంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒలింపిక్స్ స్థాయికి ఎదుగుతున్నారు. మహిళల సాధికారత కోసం అందరూ కృషి చేయాలి. ప్రతి ఇంట్లో అమ్మ, సోదరి సాధికారత కోసం అందరూ పాటుపడాలి. ప్రపంచం గర్వించే స్థాయిలో స్త్రీ శక్తి ఉండాలన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement