హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం హ్యపీ బర్త్ డే. దర్శకుడు రితేష్ రానా రెండేళ్ళు గ్యాప్ తీసుకుని ఈ సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రంలో వివేక్ అగస్థ్య కీలకపాత్రలో నటించారు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైనమెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన టీజర్‌కు విశేష స్పందన వచ్చింది.
కాగా ఈ చిత్రంలోని ముఖ్య పాత్రల్లో నటించిన ఆర్టిస్టుల క్యారెక్టర్ ప్రోమోస్‌ను మేకర్స్ రివీల్ చేస్తూ ప్రేక్షకులలో అంచనాలను క్రియేట్ చేస్తున్నారు. మొదట ఈ చిత్రాన్ని జూలై 15నవిడుదల చేయనున్నట్లు చిత్రబృందం గతంలోనే ప్రకటించింది. అయితే తాజాగా మేకర్స్ ఈ చిత్రాన్ని వారం రోజులు ముందుగా జూలై 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కాగా శుక్రవారం నాగచైతన్య ‘థ్యాంక్యూ’ సినిమాను జూలై 8 నుండి 22కి పోస్ట్ పోన్ చేశారు. ఇక జూలై 8న పెద్ద సినిమాలేవి విడుదల కాకపోవడంతో ఈ సినిమా రిలీజ్ కి సిద్ధమయింది.