Monday, November 25, 2024

National: అందరికీ ఉగాది శుభాకాంక్షలు… ప్ర‌ధాని మోదీ ట్వీట్‌…

దేశ ప్రజలకు హిందూ నూతన సంవత్సరం సందర్భంగా ప్రధాని మోదీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. దీనికోసం తన ట్విట్టర్ ఖాతాలో “అందరికీ ఉగాది శుభాకాంక్షలు!” ఇలా రాసుకొచ్చారు.

అలాగే దేశ ప్రజల జీవితాల్లో కొత్తదనాన్ని, పునరుత్తేజాన్నీ తనతో తీసుకొచ్చే ఉగాది కొత్త సంవత్సరానికి నాంది పలుకుతుంది. ఈ కొత్త సంవత్సరంలో అందరి జీవితాలలో అమితమైన సంతోషాన్ని, శ్రేయస్సుని నింపాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ పండుగ మీ అందరి జీవితాలలో అన్ని అంశాలలో సంతోషాన్ని తీసుకు వస్తుందని ఆశిస్తున్నానని తెలుగులో రాసుకొచ్చారు. దీంతో పాటుగా ప్రధాని మోడీ దేశ ప్రజలకు మొత్తం ఐదు భాషలలో శుభాకాంక్షలు తెలిపారు.

ఉగాది, సంవత్సరాది అని కూడా పిలువబడే ఉగాది, కొత్త ప్రారంభాలను తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు. ఇది వసంత కాలం ప్రారంభం, కొత్త చంద్ర చక్రం యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది. “ఉగాది” అనే పదం “ఉగా” నుండి వచ్చింది. అంటే నక్షత్రాల కోర్సు. “ఆది” అంటే ప్రారంభం. ఇది హిందూ చాంద్రమాన క్యాలెండర్ నెల చైత్ర మొదటి రోజున వస్తుంది. సాధారణంగా గ్రెగోరియన్ క్యాలెండర్‌లో మార్చి చివరిలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement