రాష్ట్ర ప్రజలందరికీ సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను అందించే భోగి.. కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి.. కనుమ పండుగలను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర ప్రజలందరికీ సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా… భోగ భాగ్యాలను అందించే భోగి.. కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి.. కనుమ పండుగలను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసే నాలుగు సంక్షేమ పథకాల అమలుకు సంక్రాంతి పండుగ నాంది పలుకుతోందని అన్నారు. రాష్ట్రంలోని దాదాపు కోటి మంది రైతులు, నిరుపేదలు, వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఈ పండుగ కొత్త వెలుగులు నింపుతుందని అన్నారు.