Saturday, January 4, 2025

Happy New Year | గుడ్‌ బై 2024.. వెల్‌కమ్‌ 2025 !

  • కోటి ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం..
  • మిన్నంటిన న్యూ ఇయర్ సంబురాలు..

యావత్‌ ప్రపంచం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. 2024కి వీడ్కోలు చెబుతూ 2025కి గ్రాండ్‌ వెల్‌కమ్‌ పలికింది. అర్ధరాత్రి తర్వాత భారత్‌లో న్యూ ఇయర్‌ సంబరాలు మిన్నంటాయి. 31వ తేదీ రాత్రి యువకులు మ్యూజిక్ సిస్టం ఏర్పాటు చేసి డ్యాన్స్ లతో హోరెత్తించారు.

చిన్నా పెద్దా అందరూ న్యూ ఇయర్ జోష్‌ని ఎంజాయ్ చేశారు. బాణాసంచా కాల్చుతూ… కోటి ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం ప‌లికారు. దేశంలోని మెట్రో నగరాలు, పల్లె-పట్టణాల్లోనూ అన్నివర్గాల ప్రజలు కొత్త సంవత్సరం ప్రారంభం రోజును వేడుకగా జరుపుకున్నారు. కాగా హైదరాబాద్ లోని ఆంధ్రప్రభ మీడియా సంస్థల ప్రధాన కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement