Sunday, September 29, 2024

ఐకమత్యంతో ఆనందంగా నవరాత్రి ఉత్సవాలు.. రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వినాయక చవితి పండగ సందర్భంగా సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గణాలకు అధిపతి అయిన ప్రథమ దేవుడు వినాయకుడిని పూజించే వినాయక చవితి పర్వదినం హిందువులకు ఎంతో పవిత్రమైనదని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ‘వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ. నిర్విఘ్నం కురుమేదేవ సర్వేకార్యేషు సర్వదా’ అంటూ శుభం కలుగాలని ఏకదంతున్ని భక్తులు ఆరాధిస్తారని తెలిపారు.

శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరిసేలా ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలలో భక్తి శ్రద్ధలతో పండుగ ఉత్సవాల్లో పాల్గొంటూ ప్రజలందరూ ఐకమత్యంతో, ఆనందంతో గణపతి నవరాత్రులను జరుపుకోవాలని సిీఎం కేసీఆర్‌ సూచించారు. గణనాథుడి ఆశీస్సులతో అనేక విఘ్నాలు అధిగమిస్తూ రాష్ట్రం సుభిక్షంగా ఉన్నదని, అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతూ ఇతర రాష్ట్రాల్రకు ఆదర్శంగా నిలుస్తున్నదని ఆయన అన్నారు.

ప్రభుత్వం చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు లంబోధరుడి ఆశీస్సులతో నిర్విఘ్నంగా కొనసాగి, రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఆనందంగా ఉండేలా దీవెనలు అందించాలని విఘ్నేశ్వరుని ప్రార్థించారు. నవరాత్రులతోపాటు, నిమజ్జనం సందర్భంగా ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టిందని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement