బురదగుంటలో చిక్కుకుని రెండురోజులు నరకయాతన అనుభవించాయి రెండు ఆడ ఏనుగులు. వాటిని రక్షించిన వీడియో వైరల్ గా మారింది.ఈ సంఘటన కెన్యాలో చోటు చేసుకుంది. నీళ్లు తాగేందుకు ఓ ప్రాంతానికి వచ్చిన రెండు ఏనుగులు ప్రమాదవశాత్తు బురదగుంటలో చిక్కుకుపోయాయి. నిజానికి కరవు సాయంలో ఇలాంటివి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఎండిపోయిన మడుగులు వద్దకు వెళ్లి చిక్కుకుపోతుంటాయి. బురదలో చిక్కుకుపోయిన ఏనుగులు నిలబడడం సాధ్యం కాక అందులో పడిపోయాయి. పైకి లేచేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో రెండు రోజులపాటు అవి అలాగే ఉండిపోయాయి. ఇలాంటి క్లిష్ట సమయాల్లో జంతువులకు మానవుల సాయం ఎంతో అవసరమని, అందుకనే ఇలాంటి వీడియోలు అందరి పెదవులపై నవ్వులు పూయిస్తాయని కెన్యా వైల్డ్ లైఫ్ సర్వీస్ (కేడబ్ల్యూఎస్) అధికారులు పేర్కొన్నారు. హెలికాప్టర్ సాయంతో ఏనుగులు చిక్కుకున్న ప్రాంతానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది.. బురదలోకి దిగి వాటికి తాళ్లు కట్టి ట్రాక్టర్, కారు సాయంతో అందులోంచి వాటిని బయటకు లాగారు. అవి బయటకు వచ్చిన తర్వాత రెండూ కలిసి అడవిలోకి పరుగెత్తాయి. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ‘షెల్ట్రిక్ వైల్డ్ ట్రస్ట్’.. రెండు రోజుల తర్వాత ఏనుగులకు ఓ ‘హ్యాపీ ఎండింగ్’ లభించిందని పేర్కొంది. వైరల్ అవుతున్న ఈ వీడియోకు ఇప్పటికే వేలాది లైకులు లభించాయి. రెస్క్యూ సిబ్బందిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
బురదగుంటలో చిక్కుకున్న రెండు ఆడ ఏనుగులు-రక్షించిన రెస్క్యూ టీం-ప్రశంసలు కురిపించిన నెటిజన్స్
Advertisement
తాజా వార్తలు
Advertisement