బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, అక్షతా మూర్తి దంపతులు 10 డౌనింగ్ స్ట్రీట్‌లోని తమ అధికార నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు చేసుకున్నారు. గత రాత్రి జరిగిన ఈ వేడుకలకు పలువురు ప్రవాస భారతీయులు, పార్లమెంటేరియన్లు, పారిశ్రామిక వేత్తలు, బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ప్రధానిగా సునాక్ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తైన సందర్భంగా ప్రధాన మంత్రి అధికార నివాసాన్ని రంగు రంగుల దీపాలతో రెడీ చేశారు.
బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్, అక్షతామూర్తి దంపతులు కలిసి దీపాలు వెలిగిస్తున్న దృశ్యాలను ప్రధాని కార్యాలయం ట్విట్టర్(ఎక్స్)లో పోస్టు చేసింది. ఈ సందర్భంగారిషి సునాక్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు వెల్లడించారు.