హ్యపీ బర్త్‌డే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ‘మత్తు వదలరా’ వంటి బ్లక్ బస్టర్ సినిమాను తెరకెక్కించిన రితేష్ రానా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.ఇటీవలే విడుదలైన పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ క్రమంలో చిత్రబృందం తాజాగా టీజర్‌ను విడుదల చేసింది. ఆయుధాల చట్టం అంటే ఏంటి సుయోధన.. ఇంటింటికి గన్, ఎదురులేని ఫన్’ అంటూ టీజర్ మొదలైంది. ‘నేను టెన్త్ ఫేయిల్ అయ్యుండోచ్చు కానీ.. గన్బిల్ మాత్రం పాస్ చేసే తీరుతా’ అంటూ వెన్నెల కిషోర్ చెప్పే డైలాగ్ హస్యాస్పదంగా ఉంది. టీజర్‌ను గమనిస్తే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. కాల భైరవ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సురేష్ సరంగం కెమెరా విజువల్స్ బాగున్నాయి. వివేక్ అగస్త్య కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైనమెంట్స్ సంస్థలు నిర్మించాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం జూలై 15న విడుదల కానుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement