Friday, November 22, 2024

హ్యాపీ బ‌ర్త్ డే అమ్ములు.. ఎన్టీఆర్ పోస్ట్

నేడు టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ భార్య ప్ర‌ణతి బ‌ర్త్ డే. ఈ మేర‌కు ఆయ‌న సోష‌ల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైర‌ల్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్‌.. తన భార్య ప్రణతిని ఏమని పిలుస్తారో రివీల్‌ అయ్యింది. ప్రణతిని ముద్దుగా అమ్ములు పిలుస్తార‌నే విషయం బయటపడింది. హ్యాపీ బర్త్ డే అమ్ములు అని తెలిపారు ఎన్టీఆర్. అయితే విషెష్‌ సింపుల్‌గానే చెప్పినా, ఓ రహస్యాన్ని బయటపెట్టారు. ఇంట్లో భార్యని ఏమని పిలుస్తారో వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రణతికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. అన్నా పార్టీ లేదా అంటున్నారు. అంతేకాదు వదినమ్మ పేరు భలే ఉందంటున్నారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌కి 2011లో మ్యారేజ్‌ జరిగింది. లక్ష్మి ప్రణతిని ఆయన వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు భార్గవ్‌ రామ్‌, అభయ్‌ రామ్‌. తారక్‌ భార్య ప్రణతి పూర్తి ప్రైవేట్‌ లైఫ్‌కే పరిమితం. ఆమె బయటకు పెద్దగా రారు. సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండరు. పూర్తి ఫ్యామిలీ లైఫ్‌కే పరిమితం అవుతున్నారు. ఇక ఎన్టీఆర్‌ ఇప్పుడు గ్లోబల్‌ స్టార్‌ అయ్యాడు. ఆర్‌ఆర్‌ఆర్ మూవీ త‌ర్వాత ఆయన ఇమేజ్‌ ఇండియా దాటి పోయింది. ప్రపంచ ఆడియెన్స్ మాత్రమే కాదు, సెలబ్రిటీలు కూడా ఆయన నటనని అభినందిస్తున్నారు. ఆయనకు అభిమానులుగా మారుతున్నాయి. ఇంతటి ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్‌ వ్యక్తిగా చాలా హుందాగా వ్యవరిస్తుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement