హైదరాబాద్ సిటీలో ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి సందర్భంగా ఎంతో ఘనంగా నిర్వహించే శోభాయాత్రను రద్దు చేస్తు్న్నట్టు భజరంగ్ దళ్ నిర్వహకులు ప్రకటించారు. నగరంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. అంతేకాకుండా.. రాష్ట్రంలో కరోనా విజృంభణ నేపథ్యంలో చాలా చోట్ల ఈరోజు హనుమాన్ జయంతి వేడుకలు భక్తులు లేకుండానే నిర్వహిస్తున్నారు. కాగా, ఇప్పటికే హైదరాబాద్‌లో హనుమాన్ శోభాయాత్రకు రాష్ట్ర హైకోర్టు షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది. గౌలిగూడ నుంచి తాడ్‌బండ్ మందిర్ వరకు సాగే ఈ శోభయాత్రలో 21 మంది మించకూడదని, ర్యాలీలో బైక్‌ల మీద ఒకరి కంటే ఎక్కువ వెళ్లకూడదు. అలాగే కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని హైకోర్టు సూచించిన విషయం తెలిసిందే. అయితే.. ఊహించని స్థాయిలో భక్తులు రావడంతో శోభాయాత్రను రద్దు చేస్తున్నట్టు నిర్వహకులు తెలిపారు.
హైదరాబాద్‌లో హనుమాన్ శోభాయాత్ర రద్దు
By ramesh nalam
- Tags
- breaking news telugu
- cancelled
- CORONA VIRUS
- hyderabad
- important news
- Important News This Week
- Important News Today
- latest breaking news
- Latest Important News
- latest news telugu
- Most Important News
- telugu breaking news
- Telugu Daily News
- telugu epapers
- Telugu Important News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- telugu trending news
- Today News in Telugu
- Top News Stories
- Top News Stories Today
- Top News Today
- Top Stories
- Top Stories Today
- Trending Stories
- viral news telugu
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement