గత కొన్ని రోజులుగా హీరోయిన్ హన్సిక పెళ్లిపీటలు ఎక్కనుందని వార్తలు వస్తున్నాయి. అయితే వరుడు ఎవరు తదితర విషయాలు చెప్పలేదు ఈ బ్యూటీ..కాగా తాజాగా తనకు కాబోయే భర్తను అభిమానులకు పరిచయం చేశారు హీరోయిన్ హన్సిక. తన చిన్ననాటి స్నేహితుడు సోహైల్‌ను వివాహమాడబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ లో అతనితో పారిస్ ఈఫిల్ టవర్ ముందు దిగిన ఫొటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. రాజస్థాన్ జైపూర్‌లోని ముండోటా కోటలో డిసెంబర్ 4న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ జంట వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నారు.దాంతో పలువురు అభిమానులు కాబోయే కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement