Friday, November 22, 2024

AP | హంద్రీనీవా ప్రాజెక్టు కాలువను వెడల్పు చేయాలి.. సీపీఐ రామ‌కృష్ణ‌

కర్నూలు జిల్లా (తుగ్గలి) : హంద్రీనీవా ప్రాజెక్టు కాలువను వెడల్పు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ ప్ర‌భుత్వాన్ని కోరారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పర్యటించారు.

ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… హంద్రీనీవా ప్రాజెక్టు కాలువలు వెడల్పు చేయాలని, అలాగే చెరువులకు పైప్ లైన్ ద్వారా నీటిని నింపాలని, చెన్నంపల్లి వద్ద తాగునీటి సమస్య ప‌రిష్కారం కోసం రిజర్వాయర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement