హైదరాబాద్ : భాగ్యనగరం వేదికగా 29 నుంచి 50వ జాతీయ సీనియర్ మహిళల హ్యాండ్‌బాల్ ఛాంపియన్‌షిప్ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి సంబంధించిన పోస్టర్లను ఆదివారం రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుతం క్రీడలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నదని, ప్రతిభ కలిగిన ఆటగాళ్లను వెలుగులోకి తీసుకొచ్చేందుకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నదని వివరించారు. స్థానిక సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంతో పాటు ఎల్‌బీనగర్‌లోని అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ వేదికలుగా టోర్నీ నిర్వహిస్తున్నట్టు జాతీయ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్ మోహన్ రాఆవు తెలిపారు.
ఈ పోటీల్లో దాదాపు 30 జట్లు పాల్గొనే అవకాశం ఉందని వివరించారు. రాష్ట్ర ప్రభుత సహకారంతో పోటీలను విజయవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హ్యాండ్ బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..