సెప్టెంబర్ 23 నుంచి జరుగనున్న ఆసియా గేమ్స్‌కు భారత చెస్ దిగ్గజాలు కోనేరు హంపి, హారిక ద్రోణవల్లితో సహా 10మంది సభ్యుల చెస్ క్రీడాకారుల బృందం వెళ్లనుంది. ఉమెన్స్ కేటగిరిలో డబుల్ ఏసియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ హంపీ, హారిక, వంటిక అగర్వాల్, ఆర్.వైశాలి, సవిత శ్రీ, పురుషుల విభాగంలో విదిత్ గుజరాతీ, అర్జున్ ఇరిగైసీ, డి.గుకేశ్, పి.హరికృష్ణ, ఆర్.ప్రజ్ఞానంద తదితరులను ఎంపిక చేసినట్లు అఖిల భారత చెస్ ఫెడరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఎంపిక చేసిన పదిమంది క్రీడాకారులు ఇటీల ముగిసిన గ్లోబల్ చెస్ లీగ్ (జీసీఎల్)లో అద్భుతంగా రాణించారని పేర్కొంది. ఆసియా గేమ్స్‌లో దాదాపు 13 ఏళ్ల తర్వాత ‘చెస్’కు అవకాశం కల్పించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement