వాయువ్య (Northwest) బంగాళాఖాతంలో ఏర్పడిన ‘హమూన్’ తీవ్ర తుపానుగా మారినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది రేపు (బుధవారం) మధ్యాహ్నం వరకు ఉత్తర ఈశాన్య దిశగా పయనించి బంగ్లాదేశ్‌లోని ఖేపుపరా-చిట్టగాంగ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, మణిపూర్, త్రిపుర, అస్సాం, మేఘాలయ రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. సముద్రం అల్లకల్లోలంగా ఉందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement