Wednesday, November 20, 2024

దారుణం.. ఫీజు కట్టలేదని జుట్టు కత్తిరించారు

కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. విస్సన్నపేట సెయింట్ థెరిస్సా విద్యాసంస్థల్లో ఏడుగురు విద్యార్థులు ఫీజు కట్టలేదని వారి జుట్టును యాజమాన్యం కత్తెరతో కట్ చేయించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే బుధవారం నాడు 10వ తరగతి చదువుతున్న పులపాక సంతోష్ కుమార్‌తో పాటు మరో ఆరుగురికి హెచ్ఎం జూలియట్ కత్తెరతో తల వెంట్రుకలు కట్ చేసినట్టు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా పిల్లలను ఉదయం నుండి సాయంత్రం దాకా స్కూలు ఆవరణలో నిలబెట్టారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పకుండా గోప్యంగా ఉంచారు. సాయంత్రం స్కూలు అయిన తర్వాత సంతోష్ కుమార్ ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పి మనస్తాపం చెంది కనపడకుండా బయటికి వెళ్లాడు. హెచ్ఎం జూలియట్ స్కూలు బస్సు నడిపే డ్రైవర్‌ను బాలుడిని వెతకటానికి పంపించారు.

ఇంత జరిగినా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఉదయం నుండి స్కూల్ ఆవరణలో నిలబడ్డారు. తల్లిదండ్రులకు సమాధానం చెప్పకుండా ఆఫీసు రూంలో తలుపులు వేసుకుని హెచ్ఎం జూలియట్ రూంలో ఉన్నారు. దీంతో తల్లిదండ్రులు మీడియాను ఆశ్రయించారు. హెచ్ఎం జూలియట్ దగ్గరకి తల్లిదండ్రులను తీసుకుని వెళ్లి అడగగా.. అలాంటిదేమీ జరగలేదని, ఈ విషయాన్ని వేరేరకంగా చెప్పారు. తల్లితండ్రులు ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి హెచ్ఎంను విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement