పసిఫిక్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోయాయి. మరోవైపు వడగాల్పులు తీవ్రమైనాయి. ఫలితంగా వేడిని తట్టుకోలేక ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రత్యేకించి ఉత్తర పసిఫిక్ ప్రాంతంలో వాతావరణం భయపెడుతోంది. ఎన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు 102 డిగ్రీల ఫారన్‌హీట్‌కు చేరుకున్నాయి.
దీంతో ప్రజలను ఆదుకునేందుకు పోర్ట్‌ల్యాండ్ రీజియన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ శీతలీకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.