Friday, September 20, 2024

Hacked – సుప్రీంకోర్టు యూట్యూబ్‌ ఛానల్‌ హ్యాక్‌..

పేజీలో ‘క్రిప్టో’ ప్రమోషన్‌ వీడియోలు
వెంట‌నే స్పందించిన సిబ్బంది
యూ ట్యూబ్ సంస్థ‌కు ఫిర్యాదు
ఛాన‌ల్ నిలుపుద‌ల‌
కొన్ని గంట‌ల‌లోనే

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కు చెందిన అధికారిక యూట్యూబ్‌ ఛానల్‌ను సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేశారు. అందులో క్రిప్టో కరెన్సీని ప్రమోట్‌ చేస్తున్నట్లుగా ఉన్న వీడియోలను పోస్ట్‌ చేశారు. ఈ యూట్యూబ్‌ ఛానల్ లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించే కేసులతో పాటు కొన్ని కీలక కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంటారు. ఈ ఛానల్‌లో ఈ వీడియోలకు బదులుగా అమెరికాలోని రిపిల్‌ ల్యాబ్స్‌కు చెందిన క్రిప్టో కరెన్సీ ఎక్స్‌ఆర్పీని ప్రచారం చేస్తూ వీడియోలను హ్యాక‌ర్లు పోస్ట్ చేశారు.


దీనిపై వెంట‌నే సుప్రీం కోర్టు సిబ్బంది స్పందించారు.. యూట్యూబ్ సంస్థ‌కు త‌మ ఛాన‌ల్ హ్యాక్ అయిన‌ట్లు ఫిర్యాదు చేశారు.. దీంతో హ్యాక‌ర్ల వీడియోలు తొల‌గించింది యూ ట్యూబ్ సంస్థ‌.. ఆ త‌ర్వాత య‌ధాత‌ధంగా ఛాన‌ల్ లో సుప్రీం కోర్టు ప్ర‌సారాలు క‌నిపించాయి..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement