పాండిచ్చేరి – దేశంలో హెచ్3ఎన్2 వైరస్ విజృంభిస్తున్నది. ఈ వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నాయి… కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో హెచ్3ఎన్2 వైరస్ కేసులు 79 నమోదయ్యాయి.. దీంతో పుదుచ్చేరి ప్రభుత్వం అన్ని స్కూళ్లను 11 రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 16 నుంచి 26 వరకు స్కూళ్లు మూసి ఉంటాయని పుదుచ్చేరి విద్యాశాఖ మంత్రి నమశ్శివాయం తెలిపారు. కాగా, ప్రజలు భయాందోళన చెందవద్దని పుదుచ్చేరి మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జీ శ్రీరాములు తెలిపారు. పెరుగుతున్న ఇన్‌ఫ్లుఎంజా కేసులను నియంత్రించేందుకు ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఆసుపత్రుల్లోని ఔట్ పేషెంట్ విభాగాల్లో (ఓపీడీ) కూడా ప్రత్యేక బూత్‌లు ప్రారంభించినట్లు వెల్లడించారు. చేతులు కడుక్కోవడం, ఫేస్ మాస్క్‌లు ధరించడం, రద్దీ ప్రాంతాల్లో తిరుగకుండా ఉండటం వంటిని పాటించాలని సూచించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement