Saturday, November 23, 2024

వెలుగులోకి హెచ్‌1బీ వీసా కుంభకోణం

హెచ్‌1–బీ వీసాలను అక్రమ మార్గాల్లో మంజూరు చేయిస్తూ క్లౌడ్‌జెన్‌ ఎల్‌ఎల్‌సీ అనే టెక్నాలజీ కంపెనీ అడ్డంగా దొరికిపోయింది. ఈ వ్యవహారం అక్కడి ఎన్‌ఆర్‌ఐలలో పెద్ద దుమారమే రేపుతోంది. రొమేనియా, కెనడా కేంద్రంగా నడుస్తున్న క్లౌడ్‌జెన్‌ టెక్నాలజీ కంపెనీకి చెందిన ఒక శాఖ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోనూ ఉంది. ప్రస్తుతానికి ఈ సంస్థ మూతబడింది.

‘బెంచ్‌ అండ్‌ స్విచ్‌’ పద్ధతిలో ఈ సంస్థ సాగించిన కుంభకోణం అమెరికా టెక్సాస్‌ లోని హ్యూస్టన్‌ నగరంలో వెలుగుచూసింది. ప్రస్తు తం అక్కడి ఫెడరల్‌ కోర్టులో ‘క్లౌడ్‌జెన్‌’పై వీసాల దుర్వినియోగం అభియోగాల కేసు నడుస్తోంది. మే 28న జరిగిన వాదనల్లో ‘క్లౌడ్‌జెన్‌’ వైస్‌ ప్రెసిడెంట్‌ జొమాన్‌ చొక్కలక్కల్‌ తాము మోసపూరితంగా పలువురికి హెచ్‌1–బీ వీసాలు ఇప్పించినట్లు న్యాయస్థానంలో అంగీకరించారు. ఈ కేసులో సెప్టెంబర్‌ 16న కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ సంస్థకు సుమారు 10 లక్షల డాలర్ల జరిమానా, ఐదేళ్లపాటు అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement