Tuesday, November 26, 2024

గువ్వల చెరువు ఘాట్‌ మృతులపై వీడిన మిస్టరీ.. అనారోగ్యంతోనే మృతి చెందినట్లు గుర్తింపు..

కడప – క్రైమ్‌ , ప్రభ న్యూస్ : గువ్వలచెరువులో లభించిన మూడు మృతదేహాల వెనుక ఎటువంటి అనుమానం లేదని కేవలం కలుషిత నీరు తాగి అనారోగ్యం కారణంగానే మరణించగా వారిని బంధువులే అక్కడ పారవేసినట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు, జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, చింతకొమ్మదిన్నె మండలం ఇప్పెంట గ్రామ రెవిన్యూ అధికారి మద్దిక ప్రతాప్‌ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గువ్వలచెరువు ఘాట్‌ 5వ మలుపు వద్ద ఇద్దరు మగ ఒక స్త్రీ మృతదేహం అనుమానాస్పద పరిస్తితుల్లో పడి ఉండడం పై కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టామని తెలిపారు, రాయలసీమలోని కడప కర్నూలు చిత్తూరు అనంతపురంతో పాటు అన్నమయ్య జిల్లా తిరుపతి జిల్లా ప్రాంతాల్లో ఎనిమిది బృందాలతో జల్లెడ పట్టినట్లు తెలిపారు, ఆయా ప్రాంతాల్లో నమోదైన మిస్సింగ్‌ కేసులను , కనిపించని వ్యక్తులు ఎవరైనా ఉంటే వారి వివరాలను సేకరించి విచారణ చేపట్టినట్లు తెలిపారు, కడప, అన్నమయ్య జిల్లాలలో కర్ణాటక, తెలంగాణా రాష్ట్రాల్లో జరిపిన విస్తృత విచారణల పలితంగా చనిపోయిన మృతుల వివరాలు తెలుసుకోగలిగామన్నారు, మృతుల బంధువులు అయినపసుపునాటి చెంచయ్య, చిరంచేట్టి చెంచు రామయ్య, బురగ భారతి, నాగులయ్య అందరు కూడా గొర్లముడివీడు గ్రామం, రాయచోటి మండల, అన్నమయ్య జిల్లాకు చెందిన వారు అని తెలిపారు, ఈ కేసులో అతి ముక్యమైన సాక్షి అయిన చలమచర్ల బసవయ్య ను విచారించడం జరిగిందన్నారు, మృతులు ఇంకా కొంతమంది యానాది కులస్తులు పొట్టకూటి కోసం కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో పలు గ్రామ పరిధిలో కంప చెట్లను కొట్టి వాటిని కాల్చి బొగ్గు అమ్ముకుని వచ్చిన కొద్దిపాటి డబ్బుతో జీవించే వారని తెలిపారు, ఈ క్రమంలో 5నెలల క్రితం సదరు పనుల మేస్త్రీ అయిన చలమచర్ల బసవయ్యతో కలిసి సదరు ముగ్గురు మృతులు, ఇంకా మల్లయ్య, అతని బార్య వెంకట రమణమ్మ, కూతురు అమ్ములు, చెంచయ్య, అతని బార్య లక్ష్మి దేవమ్మ, భారతి భర్త నాగులియ్య, చెంచయ్య కొడుకు శివాజీ ఇంకా కొంతమంది కలిసి కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా సెడం తాలూకా జిల్లేడుపల్లి గ్రామ సమీపంలో బొగ్గు కల్చుటకు వెళ్లి, ఆ క్రమంలో ఒక రోజు తాగడానికి సమీపంలో ఉన్న ఒక ఎండిన కాలువలో చెలిమను తవ్వి ఆ నీటిని తాగడానికి ఉపయోగించడంతో జూలై 1 వ తేది సాయంత్రం మొదట అమ్ములు అనే పాప తీవ్ర అస్వస్థతకు గురై వాంతులు విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

వారికి సరైన చదువు సంస్కారం లేకపోవడంతో, అవివేకంతో ఏదో ఒక తీవ్రమైన మహమ్మారి వ్యాది బారిన తాము పడ్డామని భయానికి గురై సరైన అవగాహన లేక అక్కడే క్రిష్టప్ప అనే ఆర్‌ఎంపి డాక్టర్‌ దగ్గర చికిత్స తీసుకున్నట్లు తెలిపారు, తదుపరి సేడం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుల దగ్గర ఎలాంటి గుర్తింపు కార్డులు లేకపోవడంతో అడ్మిషన్‌ దొరక్క పోవడంతో తమ ప్రాంతానికి వెళ్లి చికిత్స పొందుదామని తమ వెంట వున్న ఆటోలో బసవయ్య ఆటో నడుపుతూ, రాయచోటికి తిరుగు ప్రయాణం అయినారు. మహబూబ్‌ నగర్‌ లో జూలై 5వ తేది మధ్యాహ్నం శివ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అక్కడే ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో చేర్పించారు, మార్గ మధ్యలో మహబూబ్‌ నగర్‌ జిల్లా నారాయణపేట వద్దకు వచ్చుసరికి తీవ్రమైన వాంతులు విరేచనాల తో పసుపునాటి చెంచయ్య ఆటోలో చనిపోయినాడు. మహబూబ్‌ నగర్‌ దాటిన తరువాత చిరంచేట్టి చెంచు రామయ్య కూడా మరణించాడు. జూలై 5న అలంపూర్‌ దగ్గరకు వచ్చు సరికి బూరగ భారతి కూడా మరణించింది. ఆళ్లగడ్డ చేరుకున్న తరువాత ఆటోలో ఉండిన అమ్ములుకు, ఆమె తల్లి వెంకట రమణమ్మకు తీవ్ర అస్వస్థత కావడంతో, వారిని అంబులెన్సు లో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని పొగా, అక్కడ సరైన సౌకర్యాలు లేక, అక్కడ నుండి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని పోయి అక్కడ వెంకట రమణమ్మను చేర్పించి, అమ్ములుని మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి అమ్ములు తండ్రి మల్లయ్య తిసుకుపోగా అమ్ములు ఆసుపత్రిలో మరణించినది.

శవాన్ని ఇంటికి తెచ్చే ఆర్దిక శక్తి లేని అమ్ములు తండ్రి దయనీయ స్థితిలో తన కూతురి శవాన్ని అక్కడే హాస్పిటల్‌ లో వదలగా ఆసుపత్రి సిబ్బంది శవాన్ని అంతిమ సంస్కారం కోసం కర్నూల్‌ మునిసిపాలిటి వారికీ జూలై 6వ తేది అప్పగించినారు.అంతట బసవయ్య ఆటో నడుపుతూ ముగ్గురు శవాలను తీసుకొని, ఆటో లో చెంచయ్య బార్య పార్వతమ్మ, కొడుకు శివాజీ, చెంచురామయ్య బార్య లక్ష్మి దేవి, భారతి భర్త నాగులయ్య, వాళ్ళ ముగ్గురు చిన్న పిల్లలు కలసి రాయచోటి వైపు జాతీయ రహదారిలో బయలు దేరినారు. మృతుల ఇతర బందువులు,గ్రామస్తులు మృతులు ఎదో తీవ్రమైన జబ్బుకు గురై మరణించినారని, గ్రామానికి శవాలను తీసుకుపోతే సదరు వ్యాది ఇతరులకు సోకుతుంది అనే అమాయక, అనాగరిక, అపోహతో భయానికి గురై శవాలను ఏమి చేయాలో తెలియని దిక్కు తోచని స్థితిలో శవాలకు సరైన గౌరవమైన పద్దతిలో దహన సంస్కారాలు నిర్వహించడానికి కూడా తగిన ఆర్దిక స్తోమత కూడా లేక, శవాలను తాము వెళ్ళుతున్న దారిలో గువ్వల చెరువు ఘాట్‌ నందు జూలై 6 మద్య రాత్రి శవాలను వారి వాంతులు, బేదులు లుతో కలుషితమైన ఇతర బట్టలును, ప్లాస్టిక్‌ షీట్స్‌ కూడా అక్కడే పడవేసి తదుపరి తమ గ్రామాలకు వెళ్లిపోయినట్లు తెలిపారు, జూలై 19న నిజ నిర్దారణ కొరకు ఒక ప్రతేక బృందంగా ఏర్పడిన సీఐ శ్రీరామ శ్రీనివాసులు, ఇతర అధికారులు కర్ణాటక రాష్ట్రము, గుల్బర్గా జిల్లా, సేడం,జిల్లెడుపల్లి పరిసర ప్రాంతాలలో విచారణ జరిపి, మృతులు కలుషిత నీటిని త్రాగి తీవ్ర అస్వస్థత కు గురి కావడంతో చికిత్స్‌ ఇచ్చిన ఆర్‌ఎంపి డాక్టర్‌ ను, మహబూబ్‌ నగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల, కర్నూల్‌ ప్రబుత్వ ఆసుపత్రి, నంద్యా ప్రబుత్వ ఆసుపత్రిలలో జరిపిన పరిశోదనలో మృతులకు ఇతర బాదితులకు తీవ్ర విరచనలుకు వాంతులకు చికిత్స్‌ ఇచ్చినట్లు నిర్ధారించినట్టు తెలిపారు, జరిగిన పరిశోదనలో మృతుల మరణం వెనుక ఎలాంటి అనుమానాలు ఇతరత్రా లేవు అని కేవలం కలుషితమైన నిరు త్రాగడం వలన మృతులు మరణించినట్లు పరిశోదనలో తెలిందన్నారు, ఈ కేసును చేదించడంలో పాటుపడిన కడప డిఎస్పి వెంకట శివా రెడ్డి, ఇన్స్పెక్టర్లు శ్రీరామ శ్రీనివాసులు, సదా శివయ్య, అశోక్‌ రెడ్డి, సత్యబాబు, నాగభూషణం, సబ్‌ ఇన్స్పెక్టర్లు లు విష్ణు వర్ధన్‌, రాజ రమేష్‌, రాఘవేంద్ర రెడ్డి, అరుణ్‌ రెడ్డి, మధు సుధన్‌ రెడ్డి, తులసి నాగ ప్రసాద్‌, హెచ్‌.సి నజీర్‌, పీసీలు విజయ్‌, సుబ్బరాయుడు, చంద్రమోహన్‌ రెడ్డి, మరియు హోం గార్డ్స్‌ లక్ష్మి రెడ్డి, రెడ్డయ్య లను ఎస్పీ ప్రత్యేకంగా అభినంధించినారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement