హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. హైదరాబాద్ క్రికెట్ అధ్యక్షుడు అజారుద్దీన్ ఓ దేశద్రోహి అని, హెచ్‌సీఏలో ఆయన చేసిన అక్రమాలను బయట పెట్టాలని హెచ్‌సీఏ సెక్రటరీ గురవా రెడ్డి ఆరోపించారు. అజారుద్దీన్ తమపై నాంపల్లి కోర్టులో పరువు నష్ట దావా కేసు వేశారని, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో జరుగుతున్న అవకతవకలపై ప్రశ్నించినందుకు తమపై పరువు నష్టం దావా కేసు వేశాడని నిప్పులు చెరిగారు.
అజారుద్దీన్ రెండు కోట్లకు తమపై సివిల్ సూట్ కేసు వేశాడని గురువారెడ్డి తెలిపారు. ఫేస్ బుక్‌లో ఆరోపణలు చేసినందుకే తమపై పరువు నష్టం దావా కేసు వేశాడన్నారు. అజరుద్దీన్‌పై ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ కేసులను మళ్ళీ రీ ఓపెన్ చేయాలని, సీబీఐ చేత అజరుద్దీన్ కేసు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సివిల్ సూట్‌లో వేసిన పిటీషన్‌ను తాము కౌంటర్ వేశామని.. తాము వేసిన కౌంటర్‌కు ఇప్పటి వరకు అజారుద్దీన్ నుంచి సమాధానం లేదని మండిపడ్డారు. హెచ్‌సీఏలో వాళ్లకు మధ్య వర్గ పోరు జరుగుతుందన్నారు. బీసీసీఐ ఇచ్చిన ఆదేశాలను హెచ్‌సీఏ అధ్యక్షుడిగా చెప్పుకుంటున్న అజారుద్దీన్ అమలు చేయడం లేదన్నారు. బీసీసీఐ ఇచ్చిన గైడ్ లెన్స్‌ను హెచ్‌సీఏ అమలు చేయాలని పేర్కొన్నారు.
ఈ వార్త కూడా చదవండి: ఎంత మంది చనిపోతే ఉద్యోగాలు ఇస్తారు: షర్మిల మండిపాటు