Saturday, November 23, 2024

రెండు పేపర్లుగా గురుకుల ఉపాధ్యాయ పరీక్ష.. అన్ని సబ్జెక్టుల వారికి కామన్‌గా పేపర్‌ -1

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గురుకుల రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోబోయే అభ్యర్థులు రెండు పేపర్ల రూపంలో పరీక్షలను రాయాల్సి ఉంటుంది. ప్రతి సబ్జెక్టు ఉపాధ్యాయ అభ్యర్థి కామన్‌గా పేపర్‌ -1 కింద పెడగాగి, జనరల్‌ సైన్స్‌, మెంటల్‌ ఎబిలిటీ , ఆంగ్లంలో ప్రాథమిక నైపుణ్యాలు, ఒకాబులరీ, ఆంగ్లంలో వ్యాఖ్య నిర్మాణం తదితర అంశాలనుంచి వచ్చే ప్రశ్నలకు జవాబులు రాయాలి.

ఇక ఆయా సబ్జెక్టును రెండో పేపర్‌గా పరీక్ష రాయాల్సి ఉంటుంది. మొదటి, రెండో పేపర్లలో ఒక్కో పేపర్‌కు 150 మార్కులకు 150 ప్రశ్నలను 150 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. పేపర్‌ 1, 2కలిపి 300 మార్కుల ప్రశ్నలను ఉపాద్యాయ అభ్యర్థులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ మేరకు గురుకుల ఉపాధ్యాయ అర్హత పరీక్ష వివరాలను, సబ్జెక్టుల వారీగా సిలబస్‌ను తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ విడుదల చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement