Friday, November 22, 2024

Murder case: డేరా బాబాకు జీవిత ఖైదు..

రంజిత్​ సింగ్​ హత్య కేసులో డేరా సచ్ఛా సౌధ చీఫ్​ డేరా బాబా అలియాస్​ గుర్మీత్​ రామ్​ రహీమ్​ సింగ్​కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. డేరా బాబాను ఇటీవలే దోషిగా తేల్చిన పంచకులలోని సీబీఐ ప్రత్యేక కోర్టు.. శిక్ష ఖరారు చేసింది. ఆయనతో పాటు మరో నలుగురికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. డేరా బాబాకు రూ.31 లక్షలు, మిగతా వారికి రూ.50 వేల చొప్పున జరిమానా విధించింది.

2002లో హత్యకు గురైన రంజిత్​ సింగ్​ మర్డర్ కేసును విచారణ చేపట్టిన సీబీఐ ప్రత్యేక కోర్టు.. ఐదుగురికి దోషులుగా తేల్చుతూ అక్టోబర్​ 8న తీర్పు వెలువరించింది. గుర్మీత్ ​తో పాటు క్రిష్ణలాల్​, జస్వీర్​, సబ్దిల్​, అవతార్​ దోషులుగా తేలారు. అయితే, నిందితుల్లో ఒకరు ఇప్పటికే మరణించారు. ప్రస్తుతం డేరా బాబా జైలులో ఉన్నారు.

డేరా సచ్చా సౌదాలోనే రంజిత్ సింగ్ 2002 జులై 10న హత్యకు గురయ్యారు. రంజిత్ హత్యకు డేరా బాబా సహా జస్బీర్ సింగ్, సబ్దీల్ సింగ్, కృష్ణ లాల్, ఇందర్ సైన్‌లు కుట్ర పన్నినట్టు తేల్చింది. ఆశ్రమంలోని మహిళలను సెక్స్ బానిసలుగా చేసుకుని గుర్మీత్ రామ్ రహీమ్ చేస్తున్న అరాచకాలను బయట ప్రపంచానికి తెలిసాయి. జర్నలిస్ట్ రామ్ చందర్ ఛత్రపతి హత్య కేసులోనూ డేరా బాబాను కోర్టు దోషిగా నిర్ధారించింది. సీబీఐ విచారణతో డేరా బాబా అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ఆశ్రమంలోని ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసిన కేసులో డేరా బాబాకు 20 ఏళ్లు జైలు శిక్ష పడింది. భక్తి ముసుగులో మహిళలను సెక్స్ బానిసలుగా మార్చినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న డేరా బాబా.. ప్రస్తుతం జైలులో ఉన్నారు.

ఇది కూడా చదవండి: చిత్తూరు జిల్లాలో టీడీపీకి షాక్.. కీలక నేత రాజీనామా

Advertisement

తాజా వార్తలు

Advertisement