ఉత్తరాఖండ్‌లోని నానక్‌మట్టాలోని గురుద్వారా కర్ సేవా చీఫ్ బాబా తార్సేమ్ సింగ్ హత్య కేసులో నిందితుల్లో ఒకరైన అమర్జీత్ సింగ్ ఎన్‌కౌంటర్‌లో హతమాయ్యాడు. హరిద్వార్‌లోని థానా భగవాన్‌పూర్‌లో మంగళవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.
గత నెలలో గురుద్వారా ఆవరణలో ఉన్న కర్ సేవా చీఫ్ తార్సేమ్ సింగ్‌ను ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి కాల్పులు జరిపారు. అక్కడికక్కడే తార్సేమ్ సింగ్ ప్రాణాలు వదిలాడు.
అతడ్ని రక్షించేందుకు సిబ్బంది ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అనంతరం పరిస్థితులు ఉద్రిక్తం కావడంతో నిందితుల్ని పట్టుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో మెత్తబడ్డారు. అనంతరం నిందితులను పట్టుకునేందుకు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. మొత్తానికి పోలీసుల ఎన్‌కౌంటర్‌లో నిందితులు చనియారు. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.
తార్సేమ్ సింగ్‌ను కాల్చిచంపిన వ్యక్తిని ఉత్తరాఖండ్ ఎస్‌టిఎఫ్, హరిద్వార్ పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారని పోలీసులు మంగళవారం తెలిపారు. అమర్‌జిత్ సింగ్ మరణవార్త ప్రకటిస్తూనే, అతని సహచరుడు పారిపోయాడని, అధికారులు అతని కోసం వెతుకుతున్నారని ఉత్తరాఖండ్ డీజీపీ అభినవ్ కుమార్ తెలిపారు.