Monday, November 18, 2024

గుప్తనిధుల – ముఠా అరెస్టు

కడప (ప్రభ న్యూస్): కడప రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పరిధిలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపడుతున్న ముఠాను అరెస్ట్ చేసినట్టు కడప డీఎస్పీ వెంకట శివ రెడ్డి తెలిపారు. కడప డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ ..రాబడిన సమాచారం మేరకు కడప రిమ్స్ ఇన్స్పెక్టర్ సదాశివయ్య, ఎస్సై తాహిర్ హుస్సేన్ తన సిబ్బందితో కలిసి పాలకొండ జలపాతం ప్రాంతంలో గుప్తనిధుల కోసం నలుగురు కలిసి తవ్వకాలు జరుపుతుండగా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అరెస్టయినవారిలో కడప నగరం రామాంజనేయ పురానికి చెందిన ప్రసాద్ రెడ్డి,వెంకటేశ్వర్లు,షేక్ మాలిక్ భాష,ఓర్సు రవి అనే నలుగురు సభ్యులు ఉన్నట్లు చెప్పారు. 2 వారాల క్రితం పెండ్లిమర్రి మండలం యోగి వేమన యూనివర్సిటీ సమీపంలోని పొలాల్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపగా ఏమి లభించకపోవడంతో గుప్తనిధుల కోసం మరోసారీ ప్రయత్నాలు చేసినట్లు చేశారు. అరెస్ట్ చేసిన వీరి వద్ద నుంచి రెండు గడ్డపారలు, రెండు పారలు రెండు గోళములు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు, వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు హాజరు వస్తున్నట్లు తెలిపారు, సమాచారాన్ని అందించిన బ్లూ కోల్డ్ సిబ్బంది నారాయణ రెడ్డి, హోంగార్డు శ్రీనివాస్ లను రివార్డుల తో డి.ఎస్.పి ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement