అగ్రరాజ్యం అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 8మంది ప్రాణాలు విడిచారు. ఇల్లినాయిస్లోని చికాగోలో రెండు ఇళ్లపై కాల్పులు ఓ దుండగుడు కాల్పులు జరిపాడు.
ఈ కాల్పుల్లో 8మంది ప్రాణాలు తీశాడు. కాల్పుల అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడని పోలీసు అధికారులు వెల్లడించారు. దుండగుడి కోసం వేట కొనసాగిస్తున్నామని తెలిపారు. నగరంలో జోలియట్లోని వెస్ట్ ఎకర్స్ రోడ్లో ఉన్న 2200 బ్లాక్లో ఈ కాల్పుల ఘటన జరిగిందని, నిందితుడిని రోమియో నాన్స్ గుర్తించామని, ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని వివరించారు. రెండు ఇళ్లపై కాల్పులు జరిపాడని, మొత్తం ఏడుగురు మృత్యువాతపడ్డారని జోలియట్ పోలీసు చీఫ్ బిల్ ఎవాన్స్ వెల్లడించారు.