బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు తుపాకీ లైసెన్స్ మంజూరైంది. సల్మాన్ కు గ్యాంగ్ స్టర్ గ్రూపుల నుంచి ముప్పు ఉన్న సంగతి తెలిసిందే. పంజాబ్ సింగర్ సిద్ధూ హత్య జరిగిన కొన్ని రోజుల తేడాలోనే నటుడు సల్మాన్‌తో పాటు ఆయన తండ్రికి బెదిరింపులు వచ్చాయి. దీంతో తన ప్రాణాలకు ముప్పు ఉందని, గన్ లైసెన్స్ మంజూరు చేయాలని కోరుతూ సల్మాన్ ఖాన్ దరఖాస్తు చేసుకున్నాడు. సల్మాన్ ఖాన్ నివాసం ఉండే డీసీపీ జోన్ 9కు ఆయుధ లైసెన్స్ దరఖాస్తును పంపించారు. జోనల్ డీసీపీ నిరభ్యంతరం వ్యక్తం చేయడంతో లైసెన్స్ మంజూరైంది. గన్ లైసెన్సు కావాలంటూ గత నెలలో ముంబై పోలీసు కమీషనర్ వివేక్ ఫన్సల్కర్‌ను సల్మాన్ కలిసిన విషయం తెలిసిందే. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ హీరో సల్మాన్‌ను బెదిరించారు. 1998లో జరిగిన కృష్ణ జింక కేసుతో క్షమాపణ చెప్పాలని, లేదంటే అందుకు తగిన శిక్ష అనుభవించాల్సి వస్తుందంటూ ఆయనకు లోగడ బెదిరింపులు వచ్చాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement