చండిగడ్ – పంజాబ్ లోని స్వర్ణదేవాలయంలో బుధవారం ఉదయం కాల్పులు జరిగాయి. అమృత్‌సర్‌లోని సిక్కుల ప్రవిత్ర దేవాలయం గోల్డెన్ టెంపుల్ ప్రవేశద్వారం ముందు యోగ చేసుకుంటున్న శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఎడి) అధినేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. బుల్లెట్ గురి తప్పి సుఖ్ బీర్ సింగ్ ప్రాణాలతో బయటపడ్డాడు. రెండో రౌండ్ కాల్పులు చేయడానికి ప్రయత్నించిన దుండగుడిని సుఖ్ బీర్ సిండ్ అనుచరులు అడ్డుకున్నారు.
కాగా,అకాల్ తక్త్ విధించిన మతపరమైన శిక్ష అనుభవిస్తూ సుఖ్ బీర్ సింగ్ సర్ణదేవాలయం ముందు సేవాదర్ విధులు నిర్వహిస్తున్నారు. గోల్డెన్ టెంపుల్, ఇతర గురుద్వారాల ముందు పాత్రలు కడగడం, బూట్లు శుభ్రం చేస్తున్నారు 62ఏళ్ల సుఖ్‌బీర్ సింగ్ బాదల్ పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలోనే నేటి ఉదయం గోల్డెన్ టెంపుల్ ముఖద్వారం వద్ద ఆయన యోగ చేస్తున్న సమయంలో దుండగడు అతడిపై కాల్పులు జరిపాడు. తొలి బుల్లెట్ గోడకు తగలింది.. బుల్లెట్ శబ్దం విన్న వెంటనే ఆయన అనుచరులు అప్రమత్తమయ్యారు.. దుండగుడిని పట్టకున్నారు.. అనంతరం సుఖ్ బీర్ సింగ్ ను సురక్షిత ప్రాంతానికి తరలించారు..