న్యూఢిల్లీ: ఢిల్లీలోని తీస్ హజారి కోర్టు పరిసరాల్లో ఇవాళ కాల్పుల ఘటన చోటుచేసుకున్నది. అయితే ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. లాయర్ల మధ్య వాగ్వాదం జరగడం వల్లే ఫైరింగ్ ఘటన జరిగినట్లు సమాచారం . ఈ ఘటనను ఢిల్లీ బార్ కౌన్సిల్ చైర్మెన్ కేకే మన్నన్ ఖండించారు. ఈ ఘటన పట్ల పూర్తి స్థాయి విచారణ చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఓ వర్గం లాయర్లు తమ వద్ద ఉన్న పిస్తోళ్లతో గాలిలో కాల్పులు జరిపారని, . అయితే ఆ ఆయుధాలకు లైసెన్స్ ఉందా లేదా అన్న కోణంలో విచారణ జరగనున్నట్లు చెప్పారు. ఒకవేళ ఆ ఆయుధాలకు లైసెన్స్ ఉన్నా.. వాటిని కోర్టు పరిసరాల్లో వాడడం నేరం అవుతుందని బార్ కౌన్సిల్ చైర్మెన్ తెలిపారు. దీనిపై సంబందీకులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు..