Friday, October 18, 2024

Gun Fire – పాకిస్థాన్ లో న‌ర‌మేథం….

పాకిస్థాన్‌లో ఓ బొగ్గు గనిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ సాయుధుడు బొగ్గు గనిలోని 20 మంది ఉద్యోగులను కాల్చి చంపాడు. బలూచిస్తాన్‌లోని ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లోని దికీ జిల్లాలోని బొగ్గు గనిలోని వసతిగృహాల్లోకి సాయుధులు చొరబడ్డారు. గనిలోని ఉద్యోగులను చుట్టుముట్టి వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 20 మంది మృతిచెందగా ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరణించినవారిలో ఎక్కువమంది బలూచిస్థాన్‌లోని పష్తున్‌ ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. మృతుల్లో ముగ్గురు, గాయపడిన వారిలో నలుగురు ఆఫ్గనిస్థాన్‌కు చెందినవారని తెలిసింది.

ఇటీవల పాకిస్థాన్‌లోని అతిపెద్ద విమానాశ్రయం వెలుపల ఆత్మాహుతి దాడులు జరిగిన విషయం తెలిసిందే. వచ్చే వారంలో ఇస్లామాబాద్‌ షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ శిఖరాగ్ర సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ఈ వరుస ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. ఈ ఘ‌ట‌న త‌ర్వాత పాక్ లోని ప్ర‌ధాన ప‌ట్ట‌ణ‌, న‌గ‌రాల‌లో భ‌ద్ర‌త‌ను పెంచారు.. విదేశీయులు ఉండే ప్రాంతాల‌లో ఆర్మీ బ‌ల‌గాలు ప‌హారా కాస్తున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement