Sunday, June 30, 2024

Gun battle – రష్యాలో ఉగ్రదాడి – 15 మంది మృతి

రష్యాలోని డాగేస్థాన్‌లో మిలిటెంట్లు రెచ్చిపోయారు. రెండు చర్చిలు, ఓ యూదుల ప్రార్థనామందిరాలు, పోలీసుల పోస్టుపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో 15 మందికిపైగా చనిపోయారు. వారిలో పోలీసులతోపాటు పలువురు పౌరులు ఉన్నారని డాగేస్థాన్‌ గవర్నర్‌ సెర్గీ మెలికోవ్‌ వెల్లడించారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. కాగా, భద్రతా దళాల ఎదురుకాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మఖచ్‌కల , డెర్బెంట్‌ నగరాల్లోని చర్చిలు, ప్రార్థనామందిరాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు.

వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌ను చేపట్టాయి. ప్రస్తుతానికి ఆపరేషన్‌ ముగిసినట్లు రష్యా జాతీయ ఉగ్రవాద నిరోధక కమిటీ ప్రకటించింది. దీనిని ఉగ్రవాదుల చర్యగా ప్రకటించింది.

ఈ ఘటన కారణంగా దగేస్తాన్‌లో సోమ, మంగళ, బుధవారాలను సంతాప దినాలుగా ప్రకటించారు. రష్యాలోని దక్షిణ రాష్ట్రమైన డాగేస్తాన్‌లోని రెండు నగరాల్లోని రెండు ఆర్థోడాక్స్ చర్చిలు, ఒక ప్రార్థనా మందిరం, ట్రాఫిక్ పోలీసు పోస్ట్‌పై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారని, ఒక పాస్టర్ కనీసం ఆరుగురు పోలీసు అధికారులను చంపినట్లు రష్యా అధికారులు తెలిపారు. అదే సమయంలో సాయుధ తీవ్రవాద చరిత్ర కలిగిన ముస్లిం మెజారిటీ ప్రాంతంలో జరిగిన దాడులను తీవ్రవాద చర్యలుగా రష్యా జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కమిటీ అభివర్ణించింది..

- Advertisement -

కాస్పియన్ సముద్రంలో ఉన్న డెర్బెంట్ నగరంలోని ఒక ప్రార్థనా మందిరం, చర్చిపై సాయుధ వ్యక్తుల బృందం కాల్పులు జరిపిందని డాగేస్తాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రభుత్వ మీడియా ప్రకారం, దాడి సమయంలో చర్చి, ప్రార్థనా మందిరం రెండూ అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు అదే సమయంలో, డాగేస్తాన్ రాజధాని మఖచ్కలలోని చర్చి, ట్రాఫిక్ పోలీసు పోస్ట్‌పై దాడులు జరిగినట్లు నివేదికలు వెల్లడించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement