Sunday, December 29, 2024

Delhi | ప్రధాని మోదీని కలిసిన గుకేశ్ !

వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేశ్ నేడు ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశాడు. తాను వరల్డ్ టైటిల్ గెలుచుకునే క్రమంలో ఫైనల్లో ఆడిన చెస్ బోర్డును ప్రధానికి కానుకగా ఇచ్చాడు. దీనిపై ప్రధాని మోదీ సోషల్ మీడియాలో స్పందించారు.

‘‘చెస్ ఛాంపియన్, భారతదేశపు గర్వకారణమైన గుకేష్‌తో సంభాషణ అద్భుతంగా సాగింది. నేను కొన్ని సంవత్సరాలుగా గుకేష్ తో సన్నిహితంగా సంభాషిస్తున్నాను, అతనిలో నాకు ఎక్కువగా కనిపించేది అతని సంకల్పం, అంకితభావం. అతని ఆత్మవిశ్వాసం నిజంగా స్ఫూర్తిదాయకం. వాస్తవానికి, కొన్నేళ్ల కిందటి ఓ వీడియోలో గుకేశ్ ఏం చెప్పాడో నాకు గుర్తుంది. తాను చిన్న వయసులోనే వరల్డ్ చాంపియన్ అవుతానని చెప్పాడు. త‌న‌ స్వయంకృషితో దాన్ని సాధ్యం చేసి చూపించాడు.’’ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

కాగా, ఇటీవల సింగపూర్ వేదికగా జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో డింగ్ లిరెన్ పై గుకేశ్ అద్భుత విజయం సాధించాడు. 18 ఏళ్ల వయసులో గుకేశ్ సాధించిన ఈ ఘనత చదరంగం పండితులను సైతం ఆకట్టుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement