Saturday, November 23, 2024

Pbks vs Gt | ఉత్యంఠ పోరులో గుజరాత్ విజయం..

ఐపీఎల్ 2023 16వ సీజన్ లో మరో మ్యాచ్ ఉత్కంఠకు దారి తీసింది. హోరాహోరీగా సాగిన పోరులో గుజరాత్ టైటాన్స్ ఆరు వికెట్ల తేడాతో గెలుపోందింది. 154 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్ 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. గుజరాత్ బ్యాటర్లలో గిల్ 49 బంతుల్లో 67 పరుగులు చేసి సూపర్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. వృద్ధిమాన్ సాహా 19 బంతుల్లో 30 పరుగులు చేయగా, సాయి సుదర్శన్ 20 బంతుల్లో 19 పరుగులు , డేవిడ్ మిల్లర్ 18 బంతుల్లో 17 పరుగులకి నాటౌట్ గా రాణించాడు.

పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్, కగిసో రబాడా, హర్ ప్రీత్ తలా ఓ వికెట్ తీశారు. గుజరాత్ టైటాన్స్ కి ఇది మూడో విజయం. ఇక.. పంజాబ్ కింగ్స్ కు ఇది రెండో ఓటమి. ఆఖరి ఓవర్ లో సామ్ కర్రన్ టెన్షన్ పెట్టినా రాహుల్ తెవాటియా అద్భుతమైన బౌండరీతో గుజరాత్ కి విజయాన్ని అందించాడు.

- Advertisement -

పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్, మ్యాథ్యూ షార్ట్, జితేష్ శర్మ, భానుక రాజపక్స, సామ్ కర్రాన్, షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్

ఇంపాక్ట్ ప్లేయర్స్ లిస్ట్ : సికిందర్ రజా, హర్ ప్రీత్ సింగ్ భాటియా, రాహుల్ చాహర్, అధర్వ తైడే, గుర్నూర్ బ్రార్

గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా, శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ

ఇంపాక్ట్ ప్లేయర్స్ లిస్ట్ : విజయ్ శంకర్, శివమ్ మావి, జయంత్ యాదవ్, అభినవ్ మనోహార్, కేఎస్ భరత్

Advertisement

తాజా వార్తలు

Advertisement