Friday, November 22, 2024

వీర్యం తీసిన కాసేపటికే భర్త మృతి

గుజరాత్: కరోనా సోకి ఆసుపత్రిలో చావుతో పోరాడుతున్న భర్త(32) వీర్యం తనకు ఇప్పించాలని ఇటీవల అతడి భార్య కోర్టుకు ఎక్కిన సంగతి తెలిసిందే. భార్య వినతికి కోర్టు ఓకే చెప్పడం, కోర్టు అనుమతితో ఆసుపత్రి సిబ్బంది ఆ వ్యక్తి నుంచి వీర్యం సేకరించడం జరిగాయి. అయితే, ఆ తర్వాత కొన్ని గంటల్లోనే అతడు చనిపోయాడు.

గుజరాత్ వడోదరకు చెందిన ఓ 32 ఏళ్ల వ్యక్తి కరోనాతో బాధపడుతుండగా అతడి భార్య ఇటీవల గుజరాత్ హైకోర్టును ఆశ్రయించింది. చావుబతుకుల్లో ఉన్న తన భర్త వీర్యం ఇప్పించాలని, అతడి ద్వారా ఐవీఎఫ్‌ పద్ధతిలో ఒక బిడ్డకు తల్లి అయ్యే అవకాశం కల్పించాలని న్యాయస్థానాన్ని కోరింది. ఈ విషయంలో తన అత్త, మామలు కూడా ఆమెకు అండగా నిలిచారు. ఆమె పిటిషన్​పై సానుకూలంగా స్పందించిన గుజరాత్​ హైకోర్టు ప్రక్రియ పూర్తి చేయాల్సిందిగా సదరు ఆస్పత్రి వర్గాలను ఆదేశించింది. కోర్డు ఆదేశాల ప్రకారం, చావు బతుకుల్లో ఉన్న వ్యక్తి వీర్యాన్ని సేకరించారు డాక్టర్లు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే అతడు మరణించాడు.

ఈ వార్త కూడా చదవండి: అవయవదానం చేసి ఐదుగురి ప్రాణాలు కాపాడిన 13 ఏళ్ల బాలుడు

Advertisement

తాజా వార్తలు

Advertisement