Monday, November 18, 2024

Gujarath – ఏడడుగులు వేయ‌కుంటే హిందూ వివాహం చెల్లుబాటు కాదు … హైకోర్టు

అహ్మ‌దాబాద్ – హిందూ వివాహాలపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హిందూ వివాహంపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఏడడుగులు, ఇతర సంప్రదాయ తంతు నిర్వహించకుండా జరిగే హిందూ వివాహం చెల్లుబాటు కాబోదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. తనకు విడాకులు ఇవ్వకుండా వదిలేసిన తన భార్య మరో వివాహం చేసుకున్నారని ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టి వేసింది.

హిందూ చట్టంలో వధవు, వరుడు కలిసి నడిచే ఏడడుగులు అన్నది అత్యంత ముఖ్యమైన తంతు. అయితే ఫిర్యాదుదారు ఆరోపించినట్లుగా అలాంటిది జరిగినట్లు కనిపించడం లేదని కేసును విచారించిన జస్టిస్ సంజయ్ కుమార్ వ్యాఖ్యనించారు.

వివరాళ్లోకి వెళ్తే.. స్మృతి సింగ్ కు సత్యం సింగ్ తో 2017లో వివాహం అయింది. అయితే భర్త వేధింపులతో ఇల్లు విడిచి వెళ్లిన స్మృతి అతనిపై వర కట్నం వేధింపుల కేసు పెట్టారు. విచారణ చేసిన పోలీసులు భర్త సత్యం సింగ్, అత్తమామలపై కేసు నమోదు చేశారు. అయితే తన భార్య రెండో పెళ్లి చేసుకున్నారని, అందుకే ఇలా కేసు పెట్టారని ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు జరిపిన పోలీసులు అది అబద్ధమని తేల్చారు. ఏడడుగులు, ఇతర సంప్రదాయ తంతు నిర్వహించకుండా జరిగే హిందూ వివాహం చెల్లుబాటు కాబోదని , దీంతో ఆమె రెండో వివాహం చేసుకోలేద‌ని హైకోర్టు అభిప్రాయ‌ప‌డింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement