గుజరాత్ సీఎం విజయ్ రూపానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు తన రాజీనామా లేఖను గవర్నర్‌కు ఇచ్చారు. అయితే ఆయన రాజీనామా ఎందుకు చేశారు అనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. వ్యక్తిగత కారణాలు మరియు అనారోగ్య సమస్యల కారణంగానే ఆయన రాజీనామా చేసినట్లు సమాచారం అందుతోంది.
మరోవైపు వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విజయ్ రూపాన్ని రాజీనామా అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2016వ సంవత్సరం నుంచి విజయ్ రూపాన్ని గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేస్తున్నారు. ఆనంది బెన్ పటేల్ రాజీనామా అనంతరం విజయ్ రూపాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. కాగా ఇటీవల కర్ణాటక సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.