గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తన ఉదారత చాటుకున్నారు. ఆవుల సంరక్షణ కోసం 85 కిలోల వెండిని ఆయన విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు సమస్త్ మహాజన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తులాభారం నిర్వహించి తన బరువు ఆధారంగా 85 కిలోల వెండిని సమర్పించారు. గుజరాత్‌లో పాడి పశువుల సంరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని విజయ్ రూపానీ స్పష్టం చేశారు.
అంతేకాకుండా ఎవరైనా ఆవులను చంపితే వారికి 12 ఏళ్ల జైలు శిక్ష విధించేలా కఠిన చట్టాన్ని తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. అటు పతంగుల పండుగలో గాయపడిన పక్షులకు చికిత్స కోసం కరుణ అభియాన్ పథకాన్ని ప్రారంభించామని, దీనికి తోడు గోశాలలకు కూడా ఆర్థిక సాయం చేస్తామని విజయ్ రూపానీ పేర్కొన్నారు.