మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా ఇవ్వాల (మంగళవారం) లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఇరు జట్లు చెరో 11 మ్యాచ్ లు ఆడి ఎనిమిదేసి విజయాలతో పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాలు ఆక్రమించాయి. ఇక నేటి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్ లో స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఆడడం లేదని, అతడి స్థానంలో కరణ్ శర్మను తీసుకున్నామని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ వెల్లడించాడు. అటు, గుజరాత్ టైటాన్స్ జట్టులో మూడు మార్పులు జరిగాయి. లాకీ ఫెర్గుసన్ స్థానంలో మాథ్యూ వేడ్, సాయి సుదర్శన్ స్థానంలో సాయి కిశోర్, ప్రదీప్ సాంగ్వాన్ స్థానంలో యశ్ దయాళ్ ఆడనున్నారు.
గుజరాత్ టైటన్స్: శుభ్మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, అల్జారీ జోసెఫ్, యష్ దయాళ్, మహమ్మద్ షమీ
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డీకాక్, దీపక్ హుడా, మార్కస్ స్టొయినిస్, ఆయుష్ బదోని, కరణ్ శర్మ, కృనాల్ పాండ్యా, జేసన్ హోల్డర్, మొహ్సిన్ ఖాన్, ఆవేష్ ఖాన్, దుష్మంత చమీర.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..