ఐపీఎల్ 2023లో హార్డిక్ పాండ్యా కప్టెన్సీ వహిస్తున్న గుజరాత్ టైటాన్స్ మరోసారి భారీ విజయాన్ని నమోదు చేసింది. ముంబయి ఇండియన్స్‌తో అహ్మదాబాద్ వేదికగా ఇవ్వాల (మంగళవారం) రాత్రి జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్.. ఆ తర్వాత బౌలింగ్‌లో చెలరేగిపోయిన గుజరాత్ టైటాన్స్ 55 పరుగుల తేడాతో గెలుపొందింది. మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ 207 పరుగులు చేయగా.. ఛేదనలో ముంబయి 9 వికేట్ల నష్టానికి 152 పరుగులకే పరిమితమైంది. కాగా, ఈ సీజన్లో ఏడో మ్యాచ్ ఆడిన గుజరాత్‌కి ఇది ఐదో విజయంకాగా.. ముంబయికి ఇది నాలుగో ఓటమి.
మ్యాచ్‌లో అంతకముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఆ జట్టులో శుభమన్ గిల్ (56: 34 బంతుల్లో 7×4, 1×6) అర్ధ శతకం నమోదు చేయగా.. హిట్టర్లు డేవిడ్ మిల్లర్ (46: 22 బంతుల్లో 2×4, 4×6), అభినవ్ మనోహర్ (42: 21 బంతుల్లో 3×4, 3×6) దూకుడుగా ఆడేశారు. ఇక ముంబయి ఇండియన్స్ టీమ్ బౌలర్లలో పీయూస్ చావ్లా రెండు వికెట్లు, అర్జున్ టెండూల్కర్, బెరండ్రాఫ్, మెరాడిత్, కుమార్ కార్తికేయ ఒక్కో వికెట్ తీశారు.