అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటన్స్ జట్టు విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసి 168 పరుగులు చేసిన గుజరాత్.. తమ స్కోర్‌ను ముంబై బ్యాటింగ్ ముందు డిఫెండ్ చేసుకుంది. ఫలితంగా ముంబైపై 6 పరుగుల తేడాతో విజయం సాధించి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్ లో ముంబై బ్యాట్స్ మెన్ నమన్ ధీర్ ధనాధన్ 20 పరుగులతో ఆకట్టుకోగా.. రోహిత్ శర్మ (43), డెవాల్డ్ బ్రెవిస్ (46) పరుగులతో హాఫ్ సెంచరీ మిస్సయ్యారు. అయితే వీరిద్దరూ అవుటైన తర్వాత ముంబై ఆట స్లో అయ్యింది. ఆ తర్వాత తిలక్ వర్మ (25), ట్రావిస్ హెడ్ (11) పరుగులకే వెనుదిరిగారు. ఇక ఆఖరి ఓవర్లో గెలిపిస్తాడనుకున్న కెప్టెన్ పాండ్యా.. 11 పరుగులకు అవుట్ అయ్యాడు. దీంతో గుజరాత్ టైటన్స్ 6 పరుగుల గెలుపొందంది. ఇక గుజరాత్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్, మోహిత్ శర్మ, స్పెన్సర్ జాన్సన్, ఉమేష్ యాదవ్ తలో రెండు వికెట్లు తీయగా, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్ ఒక వికెట్ తీశారు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (45), కెప్టెన్ శుభమన్ గిల్ (35) రాణించగా.. చివర్లో రాహుల్ తెవాటియా (22) పరుగులు చేశాడు. ముంబై బౌలర్లలో గెరాల్డ్ కోయెట్జీ రెండు వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు తీచగా.. పీయూష్ చావ్లా ఒక వికెట్ తీశాడు.