టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నోకు తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. హోమ్ గ్రౌండ్ ఏకానా స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో 5 వికెట్లు నష్టానికి 163 పరుగుల చేసింది. గుజరాత్ టైటాన్స్ పేసర్ ఉమేశ్ యాదవ్ విజృంభణతో రెండు వికెట్లు కీలక కోల్పోయింది. దీంతో లక్నో 18 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కేఎల్ రాహుల్, మార్కస్ స్టోయినిస్ 3వ వికెట్‌కు 73 పరుగులు జోడించారు.
ఈ తరుణంలో (33) పరుగులు చేసిన రాహుల్ దర్శన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తరువాత పూరన్‌తో జతకట్టిన స్టోయినిస్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 58 పరుగులు చేసిన స్టోయినిస్ పెవిలియన్ చేరాడు. 112 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన లక్నోను పూరన్, బదోని ఆదుకునే ప్రయత్నం చేశారు. 20 పరుగులు చేసిన బదోని రషీద్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. చివర్లో పూరన్ దూకుడుగా ఆడటంతో లక్నో 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 చేసింది.